కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

-

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యం పెంపుదల మొదలైంది. తదుపరి డియర్‌నెస్ అలవెన్స్ ఇప్పుడు జూలై 1, 2023 నుండి వర్తిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వాస్తవానికి DA మరియు DR సంవత్సరానికి రెండు సార్లు సమీక్షించబడతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే… DA-DR లో పెరుగుదల జూలై నెలలో ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పుడైతే కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతంగా ఉంది. జనవరి 2023 నుండి మాత్రమే వర్తిస్తోంది. ఇక జులైలో డీఏ, డీఆర్‌లు ఎంత పెరుగుతుంది అనే దాని మీద అయితే స్పష్టత లేదు.

DA మరియు DRలో ఈ పెరుగుదల ఎంత అనేది ద్రవ్యోల్బణ గణాంకాల మీద ఆధార పడి వుంది. కేంద్ర ఉద్యోగులకు అందుతున్న అలవెన్సుల్లో పెరుగుదల తప్పదు. జూలైలో కూడా కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచే ఛాన్స్ వుంది. జూలైలో కూడా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4 శాతం పెంచే ఛాన్స్ వుంది. ఇదే కనుక జరిగితే కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం నుంచి నేరుగా 46 శాతానికి పెరుగుతుంది. డీఆర్‌లలో నాలుగు శాతం పెంపుదలను కేంద్ర ప్రభుత్వం పెంచే ఛాన్స్ వుంది.

గత రెండు సార్లు నిరంతరంగా 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ వుంది. జూలై 2022 డీఏను 34 శాతం నుంచి 38 శాతానికి 4 శాతం పెంచారు. మార్చి 24, 2023 న డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెరిగింది. తర్వాత డీఏ 38 నుంచి 42 శాతానికి పెంచారు. జులై 2023లో ప్రకటించబోయే డియర్‌నెస్ అలవెన్స్‌ కోసమే అంతా ఇప్పుడు చూస్తున్నారు. జులై లో డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు సంబంధించి ద్రవ్యోల్బణం తీరు, రెండు నెలల సీపీఐ-ఐడబ్ల్యూ గణాంకాలు రావడం తో రాబోయే రోజుల్లో డీఏ, డీఆర్‌లను కూడా 4 శాతం పెంచనున్నారు. 42 శాతానికి చేరిన డియర్‌నెస్ అలవెన్స్ జులై లో 46 శాతానికి పెరగవచ్చు. డీఏను 3 శాతం పెంచుతుందా లేదా 4 శాతం పెంచుతుందా అనేది నిర్ణయించడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news