రోజుకు 50 చెంపదెబ్బలు.. ఆ కొరియన్ అందగత్తెల సౌందర్య రహస్యం ఇదేనట..!

-

చిన్నప్పుడు పిల్లలు చెప్పినమాట వినకుంటే..రెండు తంతే ఆటోమెటిక్ గా లైన్ లో పడతారు అనేవారు. ఇక్కడ 50 తంతే..అందంగా వచ్చేస్తారట. ఏంటి ఆశ్చర్యంగా ఉందా. కానీ ఇది నిజమండి..రోజుకి 50 చెంపదెబ్బలు తింటే..అందంగా మారతారట. మనమేమో..అందంగా ఉండాలని..ఏవేవో సబ్బులు, క్రీమ్స్, లోషన్లు, ఓ ఎన్ని వాడేస్తాం. కానీ దక్షిణకొరియాలో మహిళలు ఈ స్లాప్ థెరపీ ఒక్కటి పాటిస్తారట. మనం కూడా ఈ మద్య కొరియన్ డ్రామాస్ బానే చూస్తున్నాం కదా..అందులో అమ్మాయిలు అంటే..మనలో చాలామందికి ఇష్టం ఉంటుంది. ఏం క్యూట్ గా ఉంటారు కదా..వాళ్ల రహస్యం మరీ చెంపదెబ్బలేనట.. ఈ చెంపదెబ్బలు ఏంటి..అందంగా ఉండటం ఏంటి అనేగా మీ డౌట్..మీరే చూడండి.

దక్షిణ కొరియాకు చెందిన మహిళలు అందం కోసం వెరైటీ థెరపీని ఫాలో అవుతున్నారు. ఇదేదో ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు. వంద ఏళ్లుగా ఆచరిస్తున్నారు. అదేంటేంట.. స్లాప్ థెరపీ. ఇలా చేస్తే ముఖం అందంగా మారుతుందట.

చెంప దెబ్బ అంటే.. లాగి పెట్టి బలంగా కొట్టడం కాదు. అలాగని మరి సుతిమెత్తంగా కూడా కాదు. రెండు చెంపలను రెండు చేతులతో మోస్తరు బలంతో బాదుకుంటే చాలు. అదే స్లాప్ థెరపీ. మొదట కొరియాలో మాత్రమే ఇది కనిపించేది. కానీ దాని వల్ల నిజంగానే మంచి ఫలితాలు వస్తుండడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీ విస్తరించింది. చెంప దెబ్బలు కొట్టుకొని మహిళలు అందంగా మారుతున్నారు. నవ్వకండి నిజమండీ..

నిపుణులు కూడా ఇది నిజమే అని సర్ఠిపికెట్ ఇచ్చేశారు. దీని వెనక సైన్స్ ఉందని చెబుతున్నారు. చెంప దెబ్బ తగిలినప్పుడు ముఖానికి రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా చర్మం కాంతివంతమవుతుంది. మృదువుగా మారుతుంది. అందుకే కొరియాలో మహిళలంతా స్లాప్ థెరపీని ఫాలో అవుతారు. చిన్నప్పటి నుంచే వీళ్లు దీన్ని ఓ అలవాటుగా మార్చుకుంటారు. కేవలం మహిళలే కాదు పురుషులు కూడా చెంప దెబ్బలు కొట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల కొరియన్ల ముఖాలు కాస్త ఎర్రగా, తాజాగా కనిపిస్తాయట.

స్లాప్ థెరపీని యాంటీ ఏజింగ్ థెరపీ కూడా భావిస్తారు. చెంప దెబ్బలతో చర్మం సున్నితంగా మారుతుంది. వయసు పెరుగుతున్నా చర్మంపై ముడతలు రావట. అందకే ఈ థెరపీతో వయసు తగ్గుతుందని కూడా కొరియన్స్ చెబుతారు. కొరియన్ మహిళలు రోజుకు 50 చెంప దెబ్బలు కొట్టుకుంటారు. కొందరైతే కాస్త గట్టిగానే స్లాప్ చేసుకుంటారు. తద్వారా రక్త ప్రసరణ బాగా పెరిగి.. ముఖ కండరాలు ధృడంగా మారుతాయని. అప్పుడ చర్మం బిగుతుగా ఉండి చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఇంతలా చెబుతున్నారంటే.. ఇందులో నిజం ఉండే ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా ఏంటి..!

Read more RELATED
Recommended to you

Latest news