రోడ్డుపై 500 నోట్ల కట్ట అయినా ఎవ్వరూ ముట్టుకోలే…! నోట్లు కడిగి ఆరపెట్టిందట

-

కరోనా కాలంలో జనం ఏది చూసిన ఏదీ తాకాలన్న భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ కరోనా ఉందో, ఏది ముట్టుకుంటే కరోనా వస్తుందో అర్దం కాక జనం బెంబేలెత్తి పోతున్నారు. ఇది వరకు ఎన్ని రకాల వైరస్ లు వచ్చినప్పటికీ ప్రజలను ఇంతలా ఏది భయపెట్టలేదు. అవి ఎది ఒక దానిని ఆధారంగా చేసుకుని ప్రజలకు సోకేవి, కానీ కరోనా అలా కాదు కరోనా ఇక్కడ ఉంటుంది అక్కడ ఉండదు అనడానిక లేదు. మామూలుగా వెళ్ళే దారిలో పది రూపాయల నోటు కనపడితే చాలు చటుక్కున తీసి జేబులో పెట్టుకుంటారు.

అలాంటిది ఏకంగా 500 రూపాయల నోట్లు దారిలో కనపడిన కూడా వాటిని తీసుకునే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యలేదు, సరికదా ఎవరో కరోనా ను ఇతరులకు అంటించడానికి ఇలా చేసుంటారు అని అనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని ఓ ఇంటిముందు మాసిపోయిన 500 నోట్లు గుంపుగా పడిఉన్నాయి. అందరూ దూరం నుంచి చూసి వెళ్లిపోతున్నారు కానీ ఎవ్వరూ వాటిని తీయ్యలేదు. పోలీసులకు సమాచారం రావడంతో వచ్చి ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు. ఒక పోలీసు చేతితొడుగు వేసుకుని నోట్లను జాగ్రత్తగా తీసి చేతుల్లో పెట్టుకున్నాడు.

వాటిపై శానిటైజర్ స్ప్రే చేసి ఓ కవరులో భద్రంగా పెట్టాడు. పోలీసులు చుట్టుపక్కల విచారిస్తే అందరూ ఆ నోట్లు తమవి కాదని చెప్పారు. ఇంతలో వైజయంతి కౌర్ అనే అనే మహిళా టీచరు పోలీసు స్టషన్‌కు రావడంతో అసలు విషయం తెలిసింది. ఆమె ఏటీఎం నుంచి పదివేల రూపాయలు తెచ్చానని, డబ్బులతో కరోనా వస్తుందమోననే భయంతో వాటిని కడిగి బాల్కనీలో టేబుల్‌పై ఆరపెట్టానని ఆవిడ పోలీసులకు చెప్పింది. వాటిలో మూడు నోట్లు గాలికి ఎగిరిపోయి ఇంటిముందు పడినట్లున్నాయని, ఆరపెట్టిన డబ్బులో 3 నోట్లు తక్కువ వచ్చాయని చెప్పింది. పోలీసులు ఆమె దగ్గరున్న మిగతా నోట్ల సిరీస్ తనిఖీ చేసుకుని ఆ 500 నోట్లు తనవే అని నిర్ధారించుకుని వాటిని ఆమెకు ఇచ్చివేసారు.

Read more RELATED
Recommended to you

Latest news