బిడ్డకు పాలు ఇవ్వడానికి గడ్డి తిన్న అమ్మ…!

-

దేశాన్ని కరోనా బారిన పడకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ను ప్రకటించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. దీంతో దేశంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సౌకర్యం కల్పించడం జరిగింది.

అయితే ఈ లాక్ డౌన్ కారణంగా దినసరి కూలీలు, వలస వచ్చిన కూలీల పరిస్తితి అత్యంత దయనీయంగా తయారైంది. జార్ఖండ్ లో జమ్ షెడ్ పూర్ లో జరిగిన ఒక సంఘటన అందరిని కలచివేసింది. లాక్ డౌన్ కారణంగా ఆదివాసీల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. జార్ఖండ్ లోని జమ్ దేస్ పూర్ నుంచి 15 కిలోమీట ర్లు దూరంలో ఉన్న సోమయ్ తండా లో నివసిస్తున్న అనితా ముండారి అనే మహిళ దీనస్థితి అక్కడి ఆదివాసీల దుర్బర పరిస్ధితుల కి అద్దం పడుతుంది.

గత 3 రోజులుగా తినడానిక తిండి గింజలు, కూరగాయలు లేక పచ్చగడ్డిని కూర వండుకుని గంజి నీళ్లతో కడుపునింపుకుంటుంది. అక్కడికి వెళ్ళిన కొందరు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఆమె సమాధానం విని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఏదో ఒకటి తిని నా కడుపు నింపుకుంటేనే కదా పాలిచ్చి నా బిడ్డ ఆకలిని నేను తీర్చగలిగేది, ఇది తప్ప నాకు వేరే గత్యంతరం లేదు అని చెప్పిన ఆమె మాటలు నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసీల పరిస్తితులకు అద్దం పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news