500 కిలోల పిండి, 26వేల కోడి గుడ్లు, 2వేల లీటర్ల పాలు.. కట్ చేస్తే 4.5 కిలోమీటర్ల బ్రెడ్‌..!! 

-

గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ రికార్డులో చోటు సాధించడం అంటే అంత చిన్న విషయం కాదు.. ఏదైనా సంథింగ్ క్రేజీగా చేయాలి. కొన్ని చూస్తే..అరే దీనికి కూడా ఇచ్చేస్తారా అనిపిస్తుంది..ఇంకొన్ని అయితే వీటికి కచ్చితంగా ఇవ్వాల్సిందే అనపిస్తుంది..4.5 కిలోమీటర్ల పొడవైన బ్రెడ్‌ను తయారు చేశారు ఓ విశ్వవిద్యాల విద్యార్థులు.. దానికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా..?
ప్రపంచంలోనే అతి పొడవైన బ్రెడ్‌ను తయారు చేసి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థులు గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. 14,360 బ్రెడ్ ముక్కల మొత్తం పొడవు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఉండే యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ విద్యార్థులు ఈ రికార్డు అందుకున్నారు.
జనవరి 6న జరుపుకునే ‘త్రీ కింగ్స్ డే’ సందర్భంగా ఈ సంప్రదాయ రోస్కాడి రెయెస్ బ్రెడ్‌ను విద్యార్థులు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బ్రెడ్‌ను రూపొందించడానికి 700 మంది విద్యార్థులు 96 గంటలపాటు శ్రమించారట…ఇందుకోసం 500 కిలోల పిండి, 26,000 కోడి గుడ్లు, 2,000 లీటర్ల పాలు, ఇతర పదార్థాలను వాడినట్లు వాళ్లు పేర్కొన్నారు.. ఆహార కేటగిరీలో ఇప్పటికే మెక్సికో పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో ఈ బ్రెడ్ కూడా చేరింది..మెక్సికోలోని విద్యార్థులే కాకుండా రెస్టారెంట్లు హోటళ్లు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే..రికార్డులు బద్దలు చేయడం మెక్సికన్స్‌ను వెన్నతో పెట్టిన విద్యే.గతంలో కూడా పొడవైన శాండ్‌విచ్‌లు చేసి రికార్డు సృష్టించారు. 73 మీటర్ల పొడవు 800 కేజీల బరువుతో ఉన్న శాండ్‌విచ్‌ను 2నిమిషాల 9 సెకన్లలో చేశారు. అప్పట్లో అదే ప్రపంచంలోనే లాంగెస్ట్‌ టోర్టా శాండ్‌విచ్‌గా పేరుపొందింది. ఇలా చూసుకుంటే.. ఫుడ్‌ విషయంలో మెక్సికన్స్‌ చాలానే చేశారు. ఏది ఏమైనా అంత పొడవున్న బ్రెడ్‌ చేయడం అంటే చిన్న విషయం కాదు.. ఏమంటారు.. ఆ బ్రెడ్‌ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి..మీరు ఓసారి చూసేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news