ఇదేందయ్యా ఇది.. ట్విట్టర్‌ ఆఫీస్‌ రెంట్‌ కట్టలేదని.. ఉద్యోగులకు గెంటేసారు..!

-

ట్విట్టర్ కొనుగోలుతో ఎలాన్ మస్క్ జీవితం అత్యంత క్లిష్టంగా మారింది. చరిత్రలో ఎవ్వరూ చూడని, వినని రీతిలో ఏకంగా మస్క్ సంపద 200 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ట్విట్టర్ బాస్ గా మారిన మస్క్ కంపెనీని రోజురోజుకూ దిగజారే స్థితికి తెస్తున్నారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ లో సైతం పరిస్థితులు దయనీయంగా మారాయని తెలుస్తోంది. తాజాగా రెంట్ చెల్లించలేదని ట్విటర్ ఆఫీసు నుంచి ఉద్యోగులను బిల్డింగ్ ఓనర్లు గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది. సింగపూర్ లోని ట్విటర్ కార్యాలయం నుంచి ఉద్యోగులను గెంటివేసినట్లు సమాచారం. అమెరికాలోని శాన్ఫ్రా సిస్కోలోనూ ఇదే పరిస్థితి. రెంట్ కట్టాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విట్టర్ ప్రకటన ఆదాయం తగ్గటంతో ఖర్చులను మదించే పనిలో భాగంగా చాలా నిర్ణయాలు తీసుకుంది. ట్విట్టర్ బాస్ ఉద్యోగులకు అనేక సౌకర్యాలను నిలిపివేసారు, సెక్యూరిటీని కూడా తొలగించారు. దీనికి తోడు కంపెనీలోని ఫర్నీచర్, కిచెన్ అప్లయెన్సెస్, ఇంకా మరెన్నో అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనికి ముందు కంపెనీని చేజిక్కించుకోగానే దాదాపు 50 శాతం మంది ఉద్యోగులను కూడా తొలగించాడు.

Read more RELATED
Recommended to you

Latest news