ల‌క్ అంటే ఇదే..రైతు పింఛ‌న్ అకౌంట్ లో 52 కోట్లు..!

బిహార్ లో బ్యాంక్ ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ‌కావ‌డం ఆస‌క్తి రేపుతోంది. అది కూడా కోట్ల‌ల్లో డ‌బ్బులు వ‌చ్చి ప‌డ‌టంతో అంతా షాక్ అవుతున్నారు. గురువారం క‌టిహార్ జిల్లాలో ఆరోత‌ర‌గ‌తి చదివే విద్యార్థి ఖాతాలో 200 కోట్లు జ‌మ కాగా మ‌రో విద్యార్థి ఖాతాలో కూడా వంద‌ల కోట్ల డ‌బ్బు జ‌మ అయ్యింది. అయితే ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే శుక్రవారం ఓ రైతు ఖాతాలో భారీగా డ‌బ్బులు జ‌మ అయ్యాయి. ముజ‌ఫ‌ర్ పూర్ జిల్లాలోని రామ్ బ‌హ‌దూర్ అనే రైతు పింఛ‌న్ ఖాతాలో రూ.52 కోట్లు మ అయ్యాయి.

అయితే ఆ డబ్బులు రైతు ఖాతాలోకి ఎక్క‌డ నుండి వ‌చ్చాయో తెలియ‌డం లేదు. దాంతో బ్యాంక్ అధికారుల‌కు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఇక త‌న ఖాతాలో ప‌డిన డ‌బ్బుల్లో సంగం అయినా త‌న‌కు ఇప్పించాల‌ని రామ్ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాడు. ఇక పోలీసుల‌కు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయ‌డంతో 52 కోట్లు అకౌంట్ లో పడ్డాయ‌న్న ఆనందం కూడా లేకుండా పోయింది.