పాన్-ఆధార్ అనుసంధానం.. గడుపు పెంచిన ఆదాయ పన్ను శాఖ

పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని చాలా రోజులుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ విషయమై ఎన్నో రోజులుగా గడువు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ పాన్ తో ఆధార్ లింక్ చేసుకోని వాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారు. పాన్ తో ఆధార్ అనుసంధానం అందరికీ రాలేదు. దాంతో ఆదాయ పన్ను శాఖ మరో మారు పాన్- ఆధార్ అనుసంధాన గడువును మరింత పెంచింది. 2022మార్చి 31వ తేదీ వరకు పాన్- ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 30వ తేదీతో పాన్- ఆధార్ లింకింగ్ సమయం ముగియాల్సి ఉంది. కానీ ఇంకా లింక్ చేసుకోని వాళ్ళ సంఖ్య భారీగా ఉండడంతో ఆదాయపన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పాన్ తో ఆధార్ అనుసంధానం పూర్తి కావాలని తెలిపింది. మరి ఇంకేం, మీ పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఇంకా పూర్తి కాలేదా? ఐతే వెంటనే లింక్ చేసుకోండి.