మ‌రో దారుణం.. 55 ఏళ్ల ఒంట‌రి మ‌హిళ‌పై హ‌త్యాచారం..!

-

దిశ హ‌త్యాచారం మ‌రువ‌క ముందే అలాంటి ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఇక తాజాగా 55 ఏళ్ల మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా, వేమవరంలో దారుణం చోటుచేసుకుంది. 55 ఏళ్ల ఒంటరి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. మృతదేహం చుట్టూ కారం చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. క్లూస్ డాగ్ మృతిరాలి ఇంటి పక్కనే తిరుగుతోంది. ఘటనా స్థలంలో పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఈ దారుణంలో పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒక‌రిని పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకుని విచారిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news