ఏపీ పురపాలక ఎన్నికల్లో 62.88 శాతం పోలింగ్

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికలు పూర్తయ్యాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో 62.28 శాతం ఓట్లు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలో గరిష్టంగా 75.93 శాతం నమోదు కాగా, కర్నూల్ జిల్లాలో కనిష్టంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నించినా.. అక్కడక్కడా ఘర్షణలు, దాడులు, అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, తోపులాట వల్ల, డివిజన్ల, వార్డుల పునర్విభజన వల్ల ఎవరి ఓట్లు ఎక్కడున్నాయో తెలియక చాలా మంది ఆందోళనకు దిగారు.

ap-panchayat-elections
ap-panchayat-elections

వైసీపీ నాయకులు కొన్ని చోట్లలో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో ప్రతిపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కేవలం అధికార పార్టీ నాయకులనే అనుమతిస్తున్నారు. అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీలను లోపలికి అనుమతించేదని ఆందోళనకు దిగారు. మరికొన్ని చోట్లల్లో వైకాపా అభ్యర్థులకు పోలీసులు మద్దతు తెలుపుతున్నారనే వాదనకు దిగారు. గుంటూరులో వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బ్యాలెట్ బాక్సును కింద పడేసేందుకు ప్రయత్నించారని టీడీపీ పోలింగ్ ఏజెంట్లు అడ్డుకోవడంతో అక్కడ కూడా గొడవ నెలకొంది. దీంతో వేణుగోపాల్ రెడ్డి వాహనంపై కొందరు రాళ్లతో దాడి చేశారు.

విశాఖ పట్నంలోని 21వ డివిజన్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులే ఓటర్లకు బదులుగా ఓట్లు వేస్తున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ప్రణవ్ గోపాల్ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని అరెస్టు చేయడంతో అక్కడ స్వల్ప ఉధ్రిక్తత చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా 25వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్నారంటూ ఆ డివిజన్ బీజేపీ అభ్యర్థి అశోక్ రెడ్డి, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రాల బయట అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా.. ఎక్కడా అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news