గుడ్ న్యూస్‌: అమ్మఒడి లబ్దిదారులకు త్వ‌ర‌లోనే రూ. 15 వేలు జ‌మ

-

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను డిసెంబ‌ర్ 29న‌ రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. అయితే అర్హత కలిగిన అమ్మఒడి లబ్దిదారులకు త్వరలో రూ. 15 వేలు జమ అవుతాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి వెల్లడించారు. అమ్మఒడి లబ్ధిదారులు మొత్తం 42 లక్షలు అని అన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ .6,500 కోట్లు కేటాయించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన ఉర్దూ పాఠశాల భవనాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. రూ .23 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. జగన్ అందించిన మంచి పరిపాలనతో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. మధ్యవర్తులను సంప్రదించకుండా ఎమ్మెల్యేలను, మంత్రులను నేరుగా సంప్రదించి వారి సేవలను ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news