భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చాలా మంది స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన సమస్యలు ఏమి వుండవు. ఆడపిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొదుపు చేస్తూ వుంటారు. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులని పెడితే చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ పథకానికి ఇచ్చే వడ్డీ రేటును పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ వడ్డీ ని 40 బేసిస్ పాయింట్స్ పెంచింది. ఇది వరకైతే 7.6 శాతంగా ఉండేది. కానీ అది ఇప్పుడు 8 శాతానికి పెరిగింది. ఇక ఈ పథకం తో ఎంత వస్తుంది..? అనే వివరాలు చూసేద్దాం. ప్రతీ ఏటా రూ.10,000 చొప్పున జమ చేస్తే మీకు 15 ఏళ్లలో రూ.1,50,000 అవుతుంది.
మెచ్యూరిటీ సమయంలో రూ.3,15,337 వడ్డీ కలిపి రూ.4,65,340 రిటర్న్స్ వస్తాయి. రూ.20,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.3,00,000 అవుతుంది. ఈ లెక్కన చూస్తే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.6,30,687 వడ్డీ కలిపి మొత్తం రూ.9,30,679 రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ ఈ స్కీమ్ కింద ప్రతీ ఏటా రూ.50,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.7,50,000 అవుతుంది. మెచ్యూరిటీ టైం లో రూ.15,76,694 వడ్డీ తో కలిపి మొత్తం రూ.23,26,698 రిటర్న్స్ ని మీరు పొందొచ్చు. రూ.75,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్ల లో రూ.11,25,000 అవుతుంది.
మెచ్యూరిటీ సమయంలో రూ.23,65,049 వడ్డీ కలిపి మొత్తం రూ.34,90,046 రిటర్న్స్ మీకు వస్తాయి. ఏటా రూ.1,00,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.15,00,000 అవుతుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.31,53,393 వడ్డీ కలిపి మొత్తం రూ.46,53,395 రిటర్న్స్ దాకా వస్తాయి. ఏటా రూ.1,50,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో రూ.22,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.47,30,097 వడ్డీ కలిపి మీరు రూ.69,80,093 రిటర్న్స్ పొందవచ్చు.