వరసగా రెండో ఏడాది… విదేశీ అతిథులు లేకుండానే రిపబ్లిక్ వేడుకలు

దేశవ్యాప్తంగా 73వ రిపబ్లిక్ వేడుకలును ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణతంత్ర వేడుకులు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే వరసగా రెండో ఏడాది కూడా విదేశీ అతిథులు లేకుండానే రిపబ్లిక్ వేడుకలు జరుగుతున్నాయి. కరోనా, ఓమిక్రాన్ భయాల వల్ల ఈ ఏడాది కూడా విదేశాల అతిథులు హాజరుకాలేదు. గతేడాది కూడా ఇదే కారణంగా విదేశీ అతిథులు లేకుండానే వేడుకలను నిర్వహించారు. ప్రతీ ఏటా రిపబ్లిక్ వేడులకు విదేశాల నాయకులను అతిథులుగా ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.

republic day
republic dayc day

ఈసారి రిపబ్లిక్ వేడుకల కోసం మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, తజకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాల ప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించింది. అయితే కరోనా, ఓమిక్రాన్ పెరుగుతుండటంతో ఆదేశాల నుంచి ప్రతినిధులు రాలేకపోయారు. గతతేడాది బ్రిటన్ ప్రధానిని అతిథిగా ఆహ్వానించినా.. కరోనా కారణంగా హాజరుకాలేకపోయారు. ఇదిలా ఉంటే విదేశీ అతిథులు లేకుండా వరసగా ఇది రెండో ఏడాది రిపబ్లిక్ వేడుకలు కాగా.. ఇప్పటి వరకు 5 సార్లు ఇలా జరిగింది.