9 మెదడులు, 3 గుండెలు.. అయినా పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!

-

ఆక్టోపస్ గురించి మనం పురుణాల్లోనూ, చదువుకునే రోజుల్లోనే చాలానే విన్నాం. దాన్ని వింతజీవిగా అంటుంటారు. ఎందుకంటే దాని రూపం కూడా చూడ్డానికి విచిత్రంగా, కొంచెం జుగుప్సాకరంగా ఉండటమే. అయితే ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు ఇందులో ఉన్నాయట. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో చూసేద్దాం.

ఇవి సహజంగా జపాన్, అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న అలూటియన్ దీవుల్లో జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లు అధికంగా కనిపిస్తాయి. ఆక్టోపస్‌ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు చొప్పున ఉంటుంది. అయితే ఒక్కో మెదడు ఒక్కోలా ఆలోచిస్తే..ఆ జీవికి కన్ఫూస్ తప్ప మరేం ఉండదు..అందుకే కంట్రోల్‌ మూవ్‌మెంట్‌ మధ్యలో ఉండే ప్రధాన మెదడు నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్షంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు అంటున్నారు.

అంతేకాకుండా ఆక్టోపస్‌లో ఉండే మరో విచిత్రం ఏటంటే..దీనికి ఏకంగా మూడు గుండెలు ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లో కాపర్‌ అధికంగా ఉండే హిమోసైనిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్ వల్లే‌ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది.

ఆక్టోపస్‌లో క్రొమటోఫోర్స్‌ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు. భలేగా ఉందికదూ..ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్‌లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి. ఆక్టోపస్‌ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి… గమనించారా?

అయితే ఆడ ఆక్టోపస్‌లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్‌లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయట. ఆడ ఆక్టోపస్‌లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయట.మొత్తానికి ఆక్టోపస్ జీవితం పిల్లలు పెట్టడంతోనే ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news