దిల్లీ ఎయిర్‌పోర్టులో రూ.70 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

-

దిల్లీ అంతర్జాతీయ విమానశ్రయంలో ఓ వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన తన బ్యాగ్​లో భారీగా హెరాయిన్​ తీసుకువస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ దాదాపు రూ. 69.95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

దేశంలో డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఓవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ నిఘా పెడుతున్నాయి. ఎక్కడికక్కడ..ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరాదారులను, వినియోగదారులను పట్టుకుంటున్నాయి. వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయినా కొందరి తీరు మారడం లేదు. తరచూ విమానాశ్రయాల్లో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.

బెల్జియం జాతీయుడైన ఓ ప్రయాణికుడు జోహన్నెస్‌బర్గ్‌ నుంచి దోహా మీదుగా దిల్లీకి వచ్చాడు. ఎయిర్‌ పోర్టులో అతని తీరును అనుమానించిన కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడు తన వెంట తీసుకొచ్చిన ఓ బ్యాగులో ఏకంగా 9 కిలోల హెరాయిన్‌ లభించింది. దాని విలువ దాదాపు రూ.70 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. తమ కళ్లుగప్పడం కోసం నిందితుడు తెలివిగా సూట్‌కేసులోని రహస్య పొరలో హెరాయిన్‌ను సీల్‌ చేశాడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news