మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొన్ని సంఘటనలు నిజంగానే యాదృచ్ఛికంగానే జరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక ఒకే రకమైన సంఘటనలు కొన్ని కొందరి జీవితాల్లో ఒకేసారి జరుగుతుంటాయి.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొన్ని సంఘటనలు నిజంగానే యాదృచ్ఛికంగానే జరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక ఒకే రకమైన సంఘటనలు కొన్ని కొందరి జీవితాల్లో ఒకేసారి జరుగుతుంటాయి. అవి కూడా మనకు
షాక్‌ను కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా చాలా అరుదనే చెప్పవచ్చు. అలాంటి అరుదైన ఘటనే ఒకటి అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఉన్న మెయిన్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్న 9 మంది నర్సులు కొంచెం అటు ఇటుగా దాదాపుగా ఒకేసారి గర్భం దాల్చారు. ఇక వారికి ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల మధ్య డెలివరీ డేట్లను కూడా ఇచ్చారు. దీంతో వారు ఒక్కొక్కరు ఒక్కో సమయంలో బిడ్డలకు జన్మనిచ్చారు. దీంతో 9 మంది నర్సులు ఇప్పుడు 9 మంది బేబీలతో దర్శనమిస్తుండే సరికి ఈ విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది.
కాగా అలా ఆ 9 మంది నర్సులు తాజాగా తమ 9 మంది చిన్నారులతో కలిసి ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలా మంది నెటిజన్లు వారికి విషెస్ చెబుతున్నారు. అయితే ఆ 9 మంది నర్సులు ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఒకర్నొకరు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారట. ఒకరికొకరు డ్యూటీ సమయంలో ఎంతో సహాయం చేసుకున్నారట. అందరూ గర్భవతులే కనుక ఒకరి ఆలనా పాలనా మరొకరు చూసుకున్నారట. అందుకని అందరూ వారిని అభినందిస్తున్నారు.!