గుడ్ న్యూస్.. పోస్ట్ ఆఫీస్ లో 98083 ఖాళీలు…అర్హత, ఖాళీల వివరాలు, అప్లై చేసుకుని విధానం మొదలైన వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీస్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వున్నా డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్ లో 98083 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. 1445 మేల్ గార్డ్స్ పోస్టులు ఉండగా.. మిగిలినవి MTS పోస్టులు వున్నాయి. 10/12వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అధికారిక సైట్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

అర్హత వివరాలు:

విద్యార్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
అదే ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వాళ్లకి వయో పరిమితి సడలింపు వుంది.
ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీ వారికీ 3 ఏళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు వివరాలు:

అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులుకి, మహిళా అభ్యర్థులుకు ఎలాంటి ఫీజు లేదు.

మరిన్ని వివరాలు:

నోటిఫికేషన్ రిలీజ్ డేట్ August 2022
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలు: ఇంకా తెలియాల్సి వుంది
చివరి తేదీ: ఇంకా తెలియాల్సి వుంది
అప్లికేషన్ కి చివరి తేదీ: ఇంకా తెలియాల్సి వుంది.

విద్యార్హతలు:

పోస్ట్ మ్యాన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మెయిల్ గార్డ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10/12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలానే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి.
ఎంటీఎస్ అభ్యర్థులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10/12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి.

ఖాళీల వివరాలు:

పోస్ట్ మాన్: 59,099
మెయిల్ గార్డ్ : 1,445
మల్టీ టాస్కింగ్ (ఎంటీఎస్): 37,539
మొత్తం ఖాళీలు: 98,083

దరఖాస్తు చేసుకునే విధానం:

ముందు website www.indiapost.gov.in లోకి వెళ్ళండి.
హోమ్ పేజ్ లోకి వెళ్లి కుడి వైపు మెనూ లో నోటిఫికేషన్స్ పైన క్లిక్ చెయ్యండి.
నోటిఫికేషన్ వచ్చాక అప్లికేషన్ లింక్ మీద నొక్కండి.
తరవాత మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వండి.
వివరాలన్నింటినీ ఇచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ని సబ్మిట్ చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news