దేశంలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న సమస్యలతో కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు కొంతమంది. అయితే, తాజాగా భార్య పుట్టింటికెళ్లి రావట్లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు ఓ వ్యక్తి.
ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, బీహార్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదని మర్మంగాన్ని కోసుకున్నాడో భర్త. కృష్ణ బసుకి, అనితకు కోనేళ్ళ క్రితం పెళ్లి జరగగా, వారికి నలుగురు సంతానం. అయితే కొన్ని రోజుల క్రితం అనిత తన పుట్టింటికి వెళ్ళగా, తిరిగి రావడానికి లేట్ అయింది. దీంతో కోపంతో కృష్ణ తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు.