ఓ రైతు ఆవిష్కరణ.. సోలార్ బ్యాటరీ కారు..!

-

దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో పలు సంస్థలు కొత్త టెక్నాలజీని జోడించి ఆవిష్కరణలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా ఓ రైతు తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మయూర్‌భంజ్‌కు చెందిన ఈ రైతు తన కారు 850 వాట్ల మోటర్ శక్తితో పనిచేస్తుందని, దీని బ్యాటరీ సామర్థ్యం 100 ఏహెచ్/54 వోల్ట్స్ ఉందన్నారు. ఇది సోలార్ పవర్ బ్యాటరీతో పనిచేస్తుందని. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ వాహనాన్ని లాక్‌డౌన్ అప్పుడే తయారు చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

సోలార్ కార్
సోలార్ కార్

మయూర్‌భంజ్‌లోని కరంజియా సబ్ డివిజన్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ రైతు. సొంతంగా తనకంటూ ఓ కారు ఉండాలని ఎప్పుడు కలలు కనేవాడు. కార్ల మీద మక్కువతోనే తన ఇంటికి దగ్గర్లోనే కారు రిపేర్ల గ్యారేజీ పెట్టుకున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సమయాన్నే అదునుగా భావించిన సుశీల్ ఎలక్ట్రిక్ సోలార్ బ్యాటరీ కారును తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా కారుకు సంబంధించిన పార్ట్‌లను సేకరిస్తూ కారును తయారు చేశాడు.

ఈ కారు బ్యాటరీ పూర్తిగా చార్జ్ చెయ్యడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతోందని సుశీల్ చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ కారులో ఏర్పాటు చేసిన చార్జింగ్ బ్యాటరీ నెమ్మదిగా చార్జ్ అవుతుంది. కానీ ఎక్కువ కాలం మన్నుతాయి. సుమారు 10 ఏళ్ల పాటూ బ్యాటరీలు పనిచేస్తాయి.” అని సుశీల్ అగర్వాల్ తెలిపారు. ఈ వాహనంలోని మోటర్ వైండింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, ఛాసిస్ వర్క్ అన్నీ వర్క్ షాపులోనే జరిగాయి. ఈ వాహన తయారు ఇద్దరు మెకానిక్స్, తన స్నేహితుడు సహకరించాడని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన నిర్మాణ పనులపై సలహాలు, సూచనలు అందించారు. కారును 3 నెలల్లోనే పూర్తి చేసినా.. అందులో మార్పులు చేర్పులు చేయడానికే ఎక్కువ సమయం తీసుకుంది. చూడటానికి కారులా కనిపించకపోయినా.. కారులాగానే ఉపయోగపడుతుందని అగర్వాల్ తెలిపారు. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే.. వారం రోజుల పాటు హాయిగా వాడుకుంటున్నామని, దీంతో రోజువారీ అవసరాలు తీరుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news