10 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన తండ్రి

-

మనుషులు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. వావీ వరసలు మర్చిపోయి విక్షణారహితంగా బిహేవ్ చేస్తున్నారు. బంధాలు మర్చిపోయి బరి తెగిస్తున్నారు. సొంత కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి (34 ఏళ్లు) .. తన 10 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న థానే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 34 ఏళ్ల ఓ వ్యక్తి తన 10 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news