టెస్లా కారుపై ఓ భారీ వృక్షం పడింది. అంత పెద్ద వృక్షం సాధారణ కారుపై పడితే.. ఆ కారు మొత్తం అప్పటికే నుజ్జునుజ్జు అవుతుంది. కానీ టెస్లా కారుపై పడటంతో కారు అద్దాలు కూడా పగలలేదు. కారును నడిపిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే ఈ ఘటనపై టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా స్పందించారు.
జై ఇన్ షాంఘై అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. చైనాలో టెస్లా మోడల్ 3కు చెందిన కారుపై భారీ వృక్షం పడింది. అయితే ఆ కారు అద్దం కూడా ధ్వంసం కాలేదు. అయితే ఆ చెట్టు కంటే నాలుగు రెట్లు బరువైన వృక్షం కూడా పడినా.. కారుకు ఏం కాదని టెస్లా పేర్కొంది. కారును నడుపుతున్న డ్రైవర్ ఎలాంటి గాయాల బారిన పడలేదు. ఈ మేరకు ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. టెస్లా కారు.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనది పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
Meanwhile in China, massive tree falls onto Tesla Model 3 glass roof driver walks away uninjured. @elonmusk once said that @Tesla Model 3 is the safest car in the world. $TSLA pic.twitter.com/uIqj25hIkr
— Jay in Shanghai 🇨🇳 (@JayinShanghai) June 10, 2022