బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మరోసారి వివాదానికి కేంద్రంగా మారింది. అయితే ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి సుశాంత్ మృతి వివాదం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపే విధంగా మారింది. అసలు విషయంలోకి వెళితే శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే చుట్టూ ఈ వివాదం తిరగడం ఇప్పుడు భారీ సంచలనాలకు దారితీస్తోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ మరణం గురించి దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆదిత్య వ్యవహార తీరుపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు అని.. ఆయనను పక్కాగా ప్లాన్ చేసిన మర్డర్ అని.. గాయాలు, మెడపై కమిలిన దెబ్బలు ఉన్నాయని.. బాడీలో ఎముకలు కూడా విరిగిపోయాయి అని .. పోస్టుమార్టం చేసిన రూప్ కుమార్ మీడియాతో వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించక ముందే బిజెపి నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యవహారంలో ఆదిత్య పాత్ర ఏంటో చెప్పాలని విచారణ జరిపించాలని.. లోక్ సభలో మహారాష్ట్ర ఎంపీ రాహుల్ షేవాలే ప్రశ్నించారు .అంతేకాదు సిబిఐ దర్యాప్తు ఈ కేసులో ఎంతవరకు వచ్చిందని కూడా అడిగారు.
ఇకపోతే సుశాంత్ సింగ్ మరణం వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఏయూ అనే పేరుతో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి కి ఫోన్ కాల్స్ వెళ్లాయి. రియా కు ఫోన్ చేసిన ఏయూ ఎవరు? ఆమెకు 44 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? అని అనుమానం వ్యక్తం చేయగా.. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ థాకరే కావచ్చు అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంపై సిబిఐ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.