దేశంలో..రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు తీసుకు వచ్చినా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. దీంతో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ప.గో జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద ఆగి వున్న లారీని ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో…ఏకంగా.. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుండి రాజమండ్రి 25 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే… అతి వేగంగా వెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు….భీమడోలు జంక్షన్ వద్ద ఆగి వున్న లారీని ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక అక్కడే ఉన్న స్థానికులు క్షత గాత్రులను ఆస్పత్రి కి తరలించారు.