కరోనా ఎఫెక్ట్… తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడగింపు..?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రానున్న రెండు వారాలు మరింత కీలకంగా మారనున్నాయి. అయితే తెలంగాణ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా… సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులను ఇచ్చారు. అయితే కేసులు తగ్గకపోవడంతో మరికొన్ని రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడమే మంచిదని వైద్యారోగ్య శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలవులను ఈనెల 20 వరకు పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్యారోగ్య శాఖ వచ్చే రెండు మూడు వారాలు కీలకం అని ఇదివరకే ప్రకటించింది. దీంతో పెరుగుతున్న కేసులను ద్రుష్టిలో పెట్టుకుని ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.