98 ఏళ్ల బామ్మ మాస్క్ లు స్వయంగా కుట్టుకుంటుంది వాహ్‌.. గ్రేట్‌ బామ్మ.!

-

కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ ల పాత్ర ఇప్పుడు చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అందరూ మాస్క్ లను వాడాలి అని సూచనలు చేస్తున్నారు. దీనితో మిషన్ కుట్టడం వచ్చిన వారు అందరూ కూడా మాస్క్ ల తయారీలో తమ వంతు కృషి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని వందల కోట్ల మాస్క్ లు అవసరం ఉంటుంది అందుకే ఎవరికి తోచిన మాస్క్ లు వాళ్ళు కుడుతున్నారు.

పంజాబ్ లో ఒక వృద్ద మహిళ మాస్క్ లను కుట్టడం గమనార్హం. ఆమె వయసు 98 ఏళ్ళు కావడం విశేషం. గుర్దేవ్ కౌర్ అనే మహిళ మాస్క్ లను కుడుతుందని ఆమె బలమైన కరోనా వారియర్ అని పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేసారు. “పంజాబీల యొక్క నిస్వార్థ అంకితభావం మనం ఎంత బలంగా ఉన్నాం అనేదానికి రుజువు అని అలాగే మన మార్గంలో వచ్చే ఏ సవాలునైనా అధిగమిస్తామని పేర్కొన్నారు.

ఆ రాష్ట్రంలో మాస్క్ ల వాడకాన్ని తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేసులు అదుపులోనే ఉన్నా సరే మాస్క్ లను లేకుండా బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన వారికి ప్రభుత్వం జరిమానా కూడా విధిస్తుంది. దీనితో రాష్ట్రంలో మాస్క్ లకు డిమాండ్ బాగా పెరిగింది. మరిన్ని మాస్క్ లు ఇప్పుడు ప్రజలకు అవసరం అని భావించి ప్రభుత్వాలు కూడా వాటి ఉత్పత్తిని పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news