కుక్కలాగా మారిన మనిషి..వింత మార్పుతో వణికి పోతున్న జనం..

-

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత వుంది..అంటే కుక్క కరిచినప్పుడు చెప్పుతొ కొడితే చనిపొతారని అర్థం..అంతేకాదు కుక్క కరిస్తే వర్షానికి తడిస్తే పిచ్చేక్కుతుంది అనే విషయం తెలిస్తే..అయితే కుక్క కరిచిన ఆరు,ఏడు నెలలకు కుక్కలా మారతారని ఎప్పుడైనా విన్నారా..అదేంటి అనుకుంటున్నారా..అవును మీరు విన్నది అక్షరాల నిజం అండీ బాబూ..ఓ వ్యక్తి అచ్చం కుక్కలా మారాడు..దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ యువకుడిని ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. అయితే అందుకు తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. తత్ఫలితంగా ఆరునెలల తర్వాత కుక్కలా మొరగడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తుంది.. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒడిశాలోని కటక్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..కటక్‌లోని అథాఘర్ పోలీసు పరిధిలోని ఉదయ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు కుక్క కాటుకి గురైన ఆరు నెలల తర్వాత మంగళవారం కుక్కలా అరవడం ప్రారంభించాడు. నివేదికల ప్రకారం.. బాధిత వ్యక్తి రాజేష్ బ్యూరాగా గుర్తించారు. రాజేష్ ని కుక్క కరిచిన తర్వాత అందుకు తగిన చికిత్స పొందలేదు. ఆరునెలల తర్వాత మంగళవారం నవంబర్ 1న సడన్ గా కుక్కలా ‘అరవడం’ మొదలుపెట్టాడు. అతని చర్యలు, కుక్కలా మొరగడం చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు..

వెంటనే అతడిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాజేష్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో కటక్‌లోని ఓ మెడికల్ కళాశాలకు తరలించారు.ఈ విషయం పై పలు పరీక్షలు చేసిన వైద్యులు బాధిత వ్యక్తికి హైడ్రోఫోబియా లేదా నీటి భయం ఏర్పడుతుందని చెప్పారు. అతడిలో రాబిస్ సోకిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. బాధిత వ్యక్తి నీటి శబ్దాన్ని కూడా సహించలేరని పేర్కొన్నారు. గొంతు నొప్పితో కుక్కలా అరవడం మొదలు పెడతారని చెప్పారు..

Read more RELATED
Recommended to you

Latest news