అరవై ఏళ్ళు దాటాయా..? అయితే ఈ స్కీమ్స్ బెస్ట్..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతుంటారు. అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడతారు. 60 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు కూడా చాలా స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. అయితే మీరు కూడా మలి వయసులో రెగ్యులర్ ఇన్‌కమ్ ని పొందాలని అనుకుంటే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టచ్చు. మరి ఇక ఆ స్కీమ్స్ గురించి వాటి వివరాల గురించి చూద్దాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీఎం వయ వందన యోజన స్కీమ్స్ లో డబ్బులు పెట్టచ్చు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రభుత్వం సపోర్ట్‌ ఉంటుంది కూడా. ఇక ఈ స్కీమ్స్ తో ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. పీఎం వయ వందన యోజన స్కీమ్ తో 7.4 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ టెన్యూర్ మూడు సంవత్సరాలు. కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.

అదే PMVVYకి అయితే 10 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినప్పుడు ఆదాయాన్ని లాక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా రిస్క్ ఉండదు. సీనియర్‌ సిటిజన్లు తమ రిటైర్మెంట్‌ ఫండ్‌ను ఈ స్కీమ్ లో పెట్టచ్చు. రూ.15 లక్షల చొప్పున SCSS, PMVVYలో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కావాలంటే జాయింట్ అకౌంట్ ని కూడా ఓపెన్ చెయ్యచ్చు. అప్పుడు రూ.30 లక్షలు మీరు ఈ స్కీమ్ కింద పెట్టచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news