పూర్ణ పెళ్లికి వచ్చిన కానుకలు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

పూర్ణ.. తన అందచందాలతో.. అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మలయాళం ఇండస్ట్రీకి చెందినవారు. మొదటిసారి నరేష్ ప్రధాన పాత్రలో సీమటపాకాయ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన “అవును, అవును 2” సినిమాల ద్వారా మరింతగా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. అలా సిల్లీ ఫెలోస్, అఖండ , దృశ్యం 2 వంటి చిత్రాలలో నటించి మెప్పించింది పూర్ణ.

ప్రస్తుతం ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు పలు టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత సందడి చేస్తోంది. తాజాగా వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఇక తన వివాహానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిధ్ ఆసిఫ్ అలీ నీ వివాహం చేసుకొని నేరుగా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం పూర్ణకు పెళ్లి సందర్భంగా వచ్చిన కానుకల విలువ తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఆమె భర్త నుంచి సుమారుగా కొన్ని కోట్ల రూపాయల విలువైన గిఫ్టులు లభించాయట. అందులో భాగంగానే పెళ్ళికి ముందే 2700 గ్రాముల బంగారాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు దాని విలువ అక్షరాలా రూ.1.30 కోట్లు..

అలాగే 25 కోట్ల రూపాయల విలువైన ఒక లగ్జరీ హౌస్ ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. ఇవే కాకుండా ఒక మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా ఆమెకు కానుకలుగా ఇచ్చినట్లు సమాచారం. ఇక వీటి విలువ సుమారుగా రూ.30 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే సన్నిహితులు, బంధువుల దగ్గర నుంచి లభించిన కానుకల విలువ మొత్తం కలిపి సుమారుగా రూ. 40 కోట్లకు పైగా ఈమెకు అందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా త్వరలోనే పూర్ణ ఆసిఫ్ అలీ రిసెప్షన్ కేరళలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news