నలుగురిని పెళ్లి చేసుకున్న ఘనుడు.. ఎలాగో తెలుసా?

-

ఒకరికి తెలియకుండా మరొకరితో ఓ వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లాలోని అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహారెడ్డి (36).. 2009లో ధన్వాడ మండలం రామ్‌కిష్టాయిపల్లికి చెందిన మహేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఊట్కూర్ మండలం సమస్ధపురం గ్రామానికి చెందిన గీతను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు.

నాలుగు-పెళ్లిళ్లు
నాలుగు-పెళ్లిళ్లు

ఈమెతో కూడా విడిపోయి.. మరో మహిళ గజ్జల రాణిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత కూడా గజ్జల రాణికి కూడా విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2021లో నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన గోపికను పెళ్లి చేసుకున్నాడు. అయితే గతేడాది నారాయణపేటలో ఉంటున్న మొదటి భార్య మహేశ్వరి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో భర్త వేధింపులకు పాల్పడటంతో మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పెళ్లిళ్ల తతంగం బయట పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news