కాన్పు కోసం 180 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి…!

-

కరోనా లాక్ డౌన్ వలస కూలీల పాలిట ఇప్పుడు శాపంగా మారింది. రోజు రోజుకి ఆకలి కేకలతో లక్షల మంది కూలీలు సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వేలాది మంది ఇప్పుడు రోడ్ల మీద తమ సొంత ఊర్లకు ప్రయాణం చేస్తున్నారు. కాలి నడకన వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఉపాధి కోసం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వచ్చిన వందలాది మంది కూలీలు ఇప్పుడు తమ ఊర్లకు వెళ్తున్నారు.

ఇలాగే ఒక కూలీ తన సొంత రాష్ట్రం ఓడిస్సా వెళ్ళడానికి సిద్దమైంది. 180 కిలోమీటర్లు నడిచి౦ది నిండు గర్భిణి. ఆమె పేరు సునీత శీల్‌.. ఆమెది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా దామన్‌పల్లి గ్రామం. రెండు నెలల క్రితం కూలి పనులు వెతుక్కుంటూ… భర్త శ్రీధర్‌ శీల్‌, సమీప బంధువు సుశాంత్‌ భైరాగ్‌తో కలసి హైదరాబాద్‌ వచ్చారు. ఈ నెలాఖరులోగా తాము చేస్తున్న సెంట్రింగ్‌ పనులు పూర్తిచేసి కాన్పునకు ఇంటికి వెళ్లాలని ఆమె అనుకుంది.

కాని అది సాధ్యం కాలేదు. లాక్ డౌన్ తో వాహనాలు ఏమీ లేవు. దీనితో ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో కాలినడకన సుమారు 500కి.మీ. దూరం ఉన్న ఊరు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుని సోమవారం ఉదయం నడవడం మొదలుపెట్టారు. ఆమెను గమనించిన ఒక లారీ డ్రైవర్… ఆమెను సూర్యాపేట వరకు తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి కాలి నడకతో సూర్యాపేట నుంచి నడక కొనసాగించిన సునీత కుటుంబ౦ ఖమ్మం జిల్లా కూసుమంచి చేరుకుంది.

ఆమెను గమనించిన తహసీల్దార్‌ శిరీష, ఎస్‌ఐ అశోక్‌ పలకరించారు. పునరావాస కేంద్రంలో వసతి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమెను తరలించారు. అక్కడి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాచారంతో అన్నం సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు అంబులెన్స్‌లో తన ఆశ్రమంలోకి తీసుకుని వెళ్లి ఆమెకు ఆశ్రయం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news