ప్లాస్మా ట్రీట్ మెంట్ తో కరోనాకి చెక్ చెప్పొచ్చా…

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే.. చాలా దేశాలు ఇప్పటికే దీని వల్ల అల్లాడిపోయాయి. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాయే అయినప్పటికీ దాని వల్ల ఇతర దేశాలు మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ దీనికి వ్యాక్సిన్ ను కనుక్కోలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కరోనాకి ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురాలేమని తేల్చి చెప్పింది. దీంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురి అవుతున్నారు.  యూకే వైద్యులు మాత్రం కరోనాకి వ్యాక్సిన్ లేకపోయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఆశలు రేపుతున్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా దీనిని నివారించవచ్చని చెబుతున్నారు…

అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి:

ప్లాస్మా థెరపీ అంటే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి వద్ద నుంచి యాంటీ బాడీస్ ను సేకరిస్తారు. వాటి ద్వారా కరోనా బాధితులకు చికిత్స అందిస్తారు. మందులకు లొంగని వైరస్ ను అదే వైరస్ నుంచి బయటపడిన వ్యక్తి రక్తంలోని ప్లాస్మా ద్వారా చికిత్స చేయవచ్చని చెబుతున్నారు. సార్స్, మెర్స్,ఎబోలా లాంటి రోగాలకు కూడా ఇదే పద్దతిలో చికిత్స అందించామని అంటున్నారు. మనిషి శరీరంలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోయినప్పుడు దీని ద్వారా చికిత్స అందించి నయం చేయొచ్చని చెబుతున్నారు. చైనాలో ఇలాంటి ప్రయోగం ద్వారానే ఐదుగురిని కరోనా బారి నుంచి కాపాడినట్లు తెలుస్తోంది..

ప్లాస్మా చికిత్స ఎలా చేస్తారు:

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తాన్ని సేకరించి దానిలో నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు. వేరు చేసిన దానిని కన్వల్సెంట్ ప్లాస్మా అని పిలుస్తారు. దీనిని విషమంగా ఉన్న కరోనా రోగికి ఎక్కిస్తారు. దీని ద్వారా ఆ రోగిలో వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి. అవే కరోనా వైరస్ ను అంతం చేయడానికి ఉపయోగపడతాయి..కరోనా నుంచి కోలుకుని..14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నవారికి ప్రధానంగా 18 నుంచి 50 ఏళ్ళ మద్య వయసున్న వారి నుంచి మాత్రమే ఈ ప్లాస్మాన్ని సేకరిస్తారు. వారు ఆరోగ్యవంతులై ,,గత ఆరు నెలల్లో ఎటువంటి శస్త్ర చికిత్స జరగని వారై ఉండాలని వైద్యులు చెబుతున్నారు…

ఏది ఏమైనా ఇప్పటి వరకూ కరోనాకి వ్యాక్సిన్ లేకపోవడం దురదృష్టకరం. దీని ప్రభావంతో చాలా దేశాలు తమ పౌరులను కోల్పోయాయి. ఇలాంటి విపత్కర తరుణంలో ఎటువంటి చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. ఈ ప్లాస్మా థెరపీని మరింతగా అభివృద్దిలోకి తీసుకొస్తే కనీసం కొంతమందినైనా కాపాడుకోవచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు…

 

Read more RELATED
Recommended to you

Latest news