దోశలు వేస్తే హ్యాపీగా కడుపునిండా తినేస్తాం.. కానీ అది చేయాడిని ముందు ప్రిపరేషన్ చాలా ఉంటుంది. సరే అంతా కష్టపడి పిండి రెడీన చేసి దోశలు వేస్తే అవి తిన్నగా వస్తాయా అంటే.. ఆ పెనానికి అతుక్కుపోయి.. ఆగం ఆగం అవుతాయి. దోశలు బాగా రావాలని మంచి మంచి నాన్‌స్టిక్ ప్యాన్‌నలు కొంటాం.. ఇకపై ఆ అవసరం లేదు.. దోశలు వేయడానికి ప్రింటర్ వచ్చేసింది. అర్థంకాలేదా..! టెక్నాలజీ సాయంతో..ఎన్నో కనిపెట్టారు.. మరి దోశలు వేసే మిషన్ కనిపెట్టడం ఏమన్నా కష్టమా ఏంటి.? ఓ కంపెనీ దోశలు వేసుకోవడానికి కిచెన్ గ్యాడ్జెట్ ఒకటి తయారు చేసింది. ఆ గ్యాడ్జెట్ చూడ్డానికి ప్రింటర్ లాగానే ఉంది. అందులో ఓవైపు పిండి పోస్తే మరోవైపు నుంచి దోశలు ప్రింటయి వస్తాయి. ఈ ప్రింటర్ ద్వారా కరకరలాడే దోశలు ప్రింట్ అవుతున్నాయి.
ప్రింట్ అయిన దోశల్ని ప్లేట్‌లో పెట్టుకొని చట్నీతో తినేస్తే సరి. ప్యాన్ మీద వేయడం.. అది సరిగ్గా రాక నానా తంటాలు పడటం, గీకి గీకి ఇంట్లో వాళ్లకు ఇబ్బంది పెట్టడం ఇవేవి లేవు.. ఈ ఐడియా ఏదో బాగుందని అనిపిస్తుందే.. అయితే ఈ టెక్నాలజీపై ఆన్‌లైన్‌లో సెటైర్లు వస్తున్నాయి. ఇలాంటి గ్యాడ్జెట్స్, మెషీన్లు మానవ జీవితం సులభతరం చేస్తుందన్న విషయం తెలుసుకానీ, మరీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రోటీ మేకర్స్ నుంచి డిష్ వాషర్స్ వరకు అనేక గ్యాడ్జెట్స్, అప్లయెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దోశ ప్రింటర్ కూడా చేరింది. .
మాములుగా ప్రింట్ ఇచ్చేప్పుడు మనం ఎలా అయితే.. ఎన్ని కాపీలు కావాలో సెట్ చేసుకుంటామో..ఈ మెషీన్‌లో కూడా ఎంత మందం దోశలు కావాలో, ఎన్ని దోశలు కావాలో సెట్ చేసుకోవచ్చు… సెట్టింగ్స్ ప్రకారం దోశలు వస్తాయి. ఈ వీడియో చూసిన వారంతా షాకవుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1.1 మిలియన్ వ్యూస్ వస్తే, 3,536 రీట్వీట్స్, 1,324 కామెంట్స్, 19.8K లైట్స్ వచ్చాయి.