మాస్క్ ధరించకపోతే నో అంటున్న రోబో.. ఎక్కడో తెలుసా ..!?

-

కరోనా మహమ్మారి విజృంభణతో మూసివేసిన వస్త్ర దుకాణాలను ప్రభుత్వ అనుమతితో తిరిగి ప్రారంభిస్తున్నారు యజమానులు. ఈ తరుణంలో షాపుకు వచ్చే వినియోగదారులు మాస్కులు ధరించాలని లేకపోతే లోపలికి అనుమతి లేదని బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తమిళనాడు తిరుచిరపల్లికి చెందిన ఓ వస్త్ర దుకాణంలో మాత్రం వినియోగదారులు మాస్కులు ధరించారో లేదో అని పర్యవేక్షించటం కోసం ఓ రోబోను ఏర్పాటు చేశారు. దీనికి ‘జఫిరా’ అని నామకరణం చేశాడు ఆ షాపు యజమాని.

robo
robo

షాపుకు వచ్చే వారి శరీర ఉష్ణోగ్రతను జఫిరా చెప్తుందని, అలాగే శానిటైజర్​ను కూడా అందజేస్తుందని ఆ యజమాని తెలిపారు. దుకాణంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని వెల్లడించారు. ఈ జఫిరాను తన అన్ని వస్త్ర దుకాణాల్లోనూ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న ప్రజలలో కనీస భయం లేకుండా కొన్ని ప్రాంతాలలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news