తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన జీవితకాలంలో 350 చిత్రాలకు పైగా నటించి ..16 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి .. 45 చిత్రాలకు పైగా నిర్మాతగా వ్యవహరించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే 79 సంవత్సరాల వయసులో మంగళవారం రోజు ఆయన మరణించడం అందరికీ బాధాకరమని చెప్పాలి. ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్టు ఇమందిరామారావు మాట్లాడుతూ.. ఏఎన్ఆర్, కృష్ణ మధ్య సత్సంబంధాలు చాలా ఉండేవని కూడా తెలిపారు.
కృష్ణ గారు చాలా స్పీడ్ అని చెప్పిన ఇమంది రామారావు.. వాళ్ళ సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటర్ గా కూడా పనిచేశారు అని తెలిపారు. ఆయన చాలా వేగంగా చేసేవారు. ఇలా పనిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏ పని అనుకుంటే.. ఆ పని కచ్చితంగా త్వరగా పూర్తిచేస్తారు. షార్ట్ ఎక్కడ వరకు కట్ చేస్తే సీన్ అందంగా ఉంటుందో కూడా కృష్ణ గారికి బాగా తెలుసు అని తెలిపారు. ముఖ్యంగా తన స్టాఫ్ కి పని కల్పించాలన్న ఆలోచనతోనే పద్మాలయ స్టూడియోను నిర్మించడం జరిగిందని కూడా ఆయన తెలిపారు. సినిమాలలో కృష్ణవేగం చూసి హిందీ వాళ్ళు కూడా సిగ్గుపడే వారిని చెప్పుకొచ్చారు రామారావు.
అదే సమయంలో తండ్రి విషయంలో మహేష్ బాబు బాధ్యతలు చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. అసలు విషయంలోకి వెళితే కృష్ణ గారికి భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. ఈ క్రమంలోని పద్మాలయా స్టూడియోస్ , కృష్ణ గారి ఇల్లు 15 కోట్ల రూపాయలకు బ్యాంకు వేలంపాటకు రాగా .. మహేష్ బాబు రంగంలోకి దిగి హామీ ఇచ్చి వేలంపాట ఆపారు అని ఆయన తెలిపారు. కుటుంబానికి సంబంధించిన అన్ని బాధ్యతలను, తండ్రి బాధితులను కూడా తీసుకొని గొప్ప కొడుకుగా ప్రూవ్ చేసుకున్నాడు అంటూ మహేష్ బాబు గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేశారు ఇమంది రామారావు.