అరుదైన గౌరవాన్ని పొందిన చిన్న సినిమా..!

-

ఐదు కథల నిజ జీవిత సంఘటనల ఆధారంగా చిన్న సినిమాగా తెరకెక్కిన చిత్రం కేరాఫ్ కంచరపాలెం. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన వారంతా కొత్త వారే కావడం గమనార్హం. ఒక ఊరి వాళ్లను మాత్రమే తీసుకొని నటింప చేసిన ప్రయోగమే ఈ సినిమా. ఇందులో నటించిన వారు నటనలో పెద్దగా ప్రావీణ్యం పొందిన వారు కూడా కాదు.. నిజ జీవితంలో వారు ఎలా ఉంటారో అలాగే ఈ సినిమాలో నటించారు. ముఖ్యంగా వారి నాచురల్ నటనతో సినిమాను దర్శకుడు చాలా గొప్పగా మలిచారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మరో సంచలనం సృష్టించింది . అంతేకాదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలను వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే ఈ సినిమా కూడా ముందు జాబితాలో ఉంటుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా మనిషి వందేళ్ళ జీవితాన్ని.. ఆయా దశల తాలూకు జ్ఞాపకాలను.. బాధ్యతలను.. ప్రేమను.. భయాలను.. గాయాలను మరిచిపోకుండా మనిషి గుండె పొరల్లో తట్టి లేపిన సినిమా ఇది. అందుకే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ సినిమాకు సలాం కొట్టేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రధమంగా ప్రదర్శించబడిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. నిజానికి ఇటీవల కాలంలో న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు సినిమాల హవా బాగా నడుస్తోందని చెప్పుకోవాలి. అయితే అక్కడ ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమాగా కంచరపాలెం నిలిచిపోయింది.

సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఒక సినిమా కంటెంట్ బాగుంటే రెండు వారాలు లేకపోతే మొదటి రోజే ఎత్తేసే అవకాశాలు కూడా ఉంటాయి.అయితే థియేటర్లలో సినిమా విడుదల చేయని రోజుల్లో కూడా ఓటీటీ లో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. ఏకంగా న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించబడింది.

Read more RELATED
Recommended to you

Latest news