చాలా మంది వారికి నచ్చిన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. దీని వలన ఆర్ధిక ఇబ్బందులు భవిష్యత్తు లో రాకుండా ఉంటాయి. అందుకే చాలా మంది పోస్టాఫీసులు, ఎల్ఐసీ, బ్యాంకులలో డబ్బులు పెడుతూ వుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. కొత్త ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్‌ను LIC తీసుకు వచ్చింది. రూ.70 పెట్టుబడి పెడితే రూ.48 లక్షలు పొందవచ్చు. ఇక ఈ స్కీమ్ వివరాలని చూస్తే.. ఈ ప్లాన్ లో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడిని పొందొచ్చు.
పిల్లల చదువులు, రుణాల చెల్లింపు వంటి వాటికి ఈ డబ్బులు ఉపయోగ పడతాయి. భవిష్యత్తు అవసరాలను కూడా ఈ ప్లాన్ తో తీర్చుకోవడానికి అవుతుంది. అలానే దీని ద్వారా బీమా రక్షణ, ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందేందుకు అవుతుంది. 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాలసీ వ్యవధి 12 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది.
గరిష్టంగా ఎటువంటి పరిమితి లేదు ఎంతైనా ఇందులో పెట్టచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వాళ్ళు ఈ ప్లాన్ ని తీసుకుంటే రూ. 26,534 పెట్టుబడి ఏడాదికి పెడితే అతనికి రూ.10 లక్షల బీమా హామీ లభిస్తుంది. అంటే ఇందులో రోజుకి డబ్భై రూపాయిలు పెట్టినట్టు. రెండో సంవత్సరంలో ఈ ప్రీమియం 25,962కి తగ్గుతుంది. ఇలా ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టి మెచ్యూరిటీపై రూ. 48 లక్షలు పొందవచ్చు. దగ్గర లో వున్న LIC కార్యాలయానికి వెళ్లి ఈ ప్లాన్ ని తీసుకోవచ్చు.