హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ తెరకెక్కిన చిత్రం అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఇప్పటికి ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకోగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ కేట్ విన్స్ లేట్ తాజాగా ఓ విషయాన్ని పంచుకుంది..
అవతార్ టు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ నటి కేట్ విన్స్ లేట్ ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ విషయాన్ని తెలిపి అందరిని షాక్‌కు గురి చేసింది దర్శకుడు జేమ్స్ కామరూన్ ప్రతి సీను ఎంతో పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా చిత్రీకరిస్తాడు అందుకు ఎలాంటి సాహసం నైనా వెనకాడకుండా చేయాలని నటీనటులకు ప్రోత్సాహం ఇస్తాడు.. అయితే ఈ క్రమంలోనే హీరోయిన్ కేట్ ఓ సీన్ కోసం నీటి అడుగున ఏకంగా ఏడు నిమిషాల పాటు ఉండవలసి వచ్చింది అంట అయితే ఈ సమయంలో తాను ఊపిరి పీల్చుకోవటం కూడా అవ్వలేదని తెలిపింది..
“షూటింగ్ నీటికి అడుగు భాగంలో చేయవలసి వచ్చింది.. ఈ సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యా.. అలాగే ఒకానొక సమయంలో చనిపోతున్నానేమో అంటూ కూడా భయం వేసి గట్టిగా అరిచాను.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది దాదాపు 7 నిమిషాల పాటు ఊపిరి పీల్చుకోకుండా నీటిలో ఉండిపోయా.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయా..” అంటూ చెప్పకు వచ్చింది కేట్.. దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన టైటానిక్ చిత్రంలో కేట్ వెన్స్ లేట్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాకు దర్శకుడు కూడా జేమ్స్ కామెరూన్..