జగన్ సర్కార్ కు మరో షాక్ ఇచ్చారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులు, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
విజయవాడలో గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘ఉద్యోగుల బకాయిలు-చెల్లింపులు-చట్టబద్ధత’ అనే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
జీతాలు, పిఎఫ్, జిపిఎఫ్, ఏపీజిఎల్ఐ రుణాలు, ఆర్జిత సెలవుల చెల్లింపుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనప్పుడు ఏం చేయాలి? రుణాలు క్లెయిములను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది’ అని వెల్లడించారు.