మునుగోడులో ట్విస్ట్..బీజేపీ సైలెంట్ స్కెచ్..!

-

మునుగోడు ఉపఎన్నికలో గెలవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు గట్టిగానే కష్టపడుతున్నాయి. కానీ ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో తెరవెనుక గెలుపు కోసం ఏం చేయాలో..అవి చేయడానికి రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి.

 

అయితే దుబ్బాక-హుజూరాబాద్ మాదిరిగా మునుగోడులో బీజేపీ గెలుపు ఈజీ కాదు అని అర్ధమైపోతుంది. ఇప్పటివరకు వస్తున్న సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తుంది. పైగా రెండోస్థానం కోసం కాంగ్రెస్‌తో బీజేపీ పోటీ పడే పరిస్తితి ఉందని సర్వేల్లో తెలుస్తోంది. ఇక ఇటు ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో టీఆర్ఎస్..బీజేపీని గట్టిగా టార్గెట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి కష్టాలు పెరిగాయి. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైన సరే బీజేపీ నేతలు వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. చావో రేవో తేల్చుకోవడమే లక్ష్యంగా మునుగోడులో కమలదళం పనిచేస్తుందని తెలుస్తోంది.

ఇక ఈ రెండు రోజులు కీలకంగా భావించి..ఈ సమయంలో సైలెంట్‌గా ఓటర్లని టీఆర్ఎస్‌కు ధీటుగా ఓటర్లని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఓట్లని లాగడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌కు గెలుపు అసాధ్యమని, కాబట్టి తమకు మద్ధతు ఇవ్వాలని చెప్పి కమలం నేతలు సైలెంట్‌గా ఓటర్లలోకి వెళుతున్నారు. అటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు..ఏ ఇతర పార్టీలకు ఎక్కువ పడకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అయితే సర్వేల్లో ఏ పార్టీ గెలిచిన తక్కువ మెజారిటీతోనే గెలుస్తుందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉందని అంటున్నారు..కాబట్టి ఎన్నికల తేదీ లోపు ఓటర్లని మార్చేయాలని విధంగా బీజేపీ పనిచేస్తుంది. ఏదేమైనా మునుగోడుని వదలకూడదని లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి చూడాలి మునుగోడులో బీజేపీ ఏ మేరకు సత్తా చాటుతుందో..ఈ చివరి రెండు రోజుల్లో ఎలాంటి రాజకీయం చేస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news