కడప జిల్లా లో ఈ రోజు తెల్ల వారు జామున దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం ఉన్న రమేష్ థియేటర్ ఎదురుగా ఉన్న రెండంతస్థుల భవనం భవనం కుప్పకూలింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రెండంతస్థుల భవనంలో ఒక భాగం పూర్తి గా కూలింది. మరొక భాగం కూలడానికి సిద్ధంగా ఉంది. కూలడానికి సిద్ధంగా ఉన్న భాగంలో ఒక తల్లి, కూతరు ఉన్నారు.
వారిని కాపడటానికి స్థానికులు సమాచారం తో అగ్నీ మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండవ అంతస్తు లో రాలేక ఇరుక్కుపోయిన తల్లి , బిడ్డలు లను ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఫైర్ సిబ్బంది వల్ల తల్లి కొమ్ము చంద్రిక తో పాటు తంశ్రీ అనే చిన్నారి ప్రాణా ల తో బయట పడ్డారు. వీరిని ఫైర్ సిబ్బంది భావనానికి ఉన్న కిటికి ని కట్ చేసి కాపాడారు. అయితే ఇటీవల కడప జిల్లా భారీ వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాల వల్లే ఈ పాత భవనం దెబ్బతిని కూలిందని స్థానికులు చెబుతున్నారు.