సంవత్సరం తర్వాత.. పుల్వామా దాడి ఘటనలో కొత్త నిందితులు

-

40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లను బలితీసుకొన్న పుల్వామా ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ). తాజాగా మరో నిందితుడిని అరెస్ట్​ చేసింది. ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఎన్​ఐఏ అధికారులు.ఈ ఘటనకు కారకులైన 20 ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌, రవూఫ్ అజ్గర్ వంటి వారిని చేర్చినట్టు తెలుస్తోంది.

జమ్మూలోని ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. 18 నెలల సుదీర్ఘ దర్యాప్తు తరువాత ఎన్ఐఏ 5 వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ వేయనుంది. 2019 ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ వాహనశ్రేణిపై జైషే మహ్మద్​ ​ ఉగ్ర దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.పాకిస్థాన్ నుంచి దాదాపు 20 కేజీల ఆర్‌డీఎక్స్ పేలుడు సామాగ్రిని పేలుడు కోసం తెచ్చినట్టు ఓ అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news