విజయవాడ స్వర్ణ ప్యాలెస్ బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

-

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో అగ్నికీలలు, దట్టమైన పొగ పూర్తిగా వ్యాపించడానికి 30 నుంచి 45 నిమిషాల ముందే ప్రమాదం మొదలై ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. అయితే ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం, పొగను గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థ సక్రమంగా లేకపోవడం పెను ప్రమాదానికి దారితీసిందని తేల్చారు. ఈ రెండింటిలో ఏది ఉన్నా మంటను ప్రారంభంలోనే గుర్తించి, దాన్ని కట్టడి చేసి ఆర్పివేసేందుకు ఆస్కారం ఉండేదని నిర్ధారణకు వచ్చారు.

రెండు రోజులుగా ఘటనా స్థలంలో వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చారు.మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు.ఈ ఘటనపై సీఎం జగన్ మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు.ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్‌ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news