విదేశాల్లో వజ్రాల వ్యాపారం వదిలేసి.. ఇండియాలో వ్యవసాయం చేస్తున్న యువకుడు..!!

-

విదేశాల్లో వ్యాపారం అంటే లాభం బానే ఉంటుంది.. మంచి లైఫ్‌.. కానీ అవన్నీ వదిలేసి ఓ వ్యక్తి ఇండియాకు వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు.. పిచ్చోడు అనుకుంటారేమో.. మన కుటుంబంలో వారికి ఏదైనా అనుకోని కష్టం వస్తే..ఆ కష్టానికి కారణం మనం వాడే వస్తువులు, తినే ఆహారమే అని తెలిస్తే.. ఒక్కసారిగా ఈ సమాజంపై తీవ్రమైన కోపం వస్తుంది.. సినిమాల్లో చూపిస్తారు కదా.. జంక్‌ఫుడ్స్‌వల్ల, వాటర్‌ బాటిల్‌ వల్ల పిల్లలకు క్యాన్సర్ వచ్చిందని తల్లి వాటిని బ్యాన్‌ చేయడానికి పోరాడుతుంది.. ఇక్కడ కూడా అదే జరిగింది.. తల్లికి క్యాన్సర్‌ రావడానికి కారణం..రసాయనాలతో కూడిన కూరగాయలే అని తెలిసి.. ఆ వ్యక్తి వజ్రాల వ్యాపారం వదిలేసి.. సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులేశాడు. ఈ యువకుడి గురించి మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
సింగపూర్‌లో వజ్రాల వ్యాపారం చేసేవాడు బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్ నివాసి ఎస్ పధియార్. అయితే తన తల్లికి క్యాన్సర్ సోకిందని తెలియడంతో ఎస్ పధియార్ సింగపూర్‌లో వజ్రాల వ్యాపారాన్ని వదిలేసి.. సొంతూరికి వచ్చి తన తల్లిని క్యాన్సర్ చికిత్స కోసం తీసుకెళ్లాడు.
కూరగాయలతోపాటు ఆహార పదార్థాల్లో రసాయనిక ఎరువులు వాడటం, కల్తీ ఆహారం తీసుకోవడం వల్లే ఈ క్యాన్సర్ వ్యాధి సోకిందని డాక్టర్ తెలిపారు. ఆ తర్వాత ఎస్ పధియార్ ఈ విషయంపై మరితం అధ్యయనం చేశాడు. తన పేరున ఉన్న కొద్దిపాటి భూమిలో స్థానిక మొక్కలతో సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించాడు.
పధియార్.. ఉత్తర గుజరాత్‌లో మొదటిసారిగా పసుపును సాగుచేశాడు. దాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించి మంచి ఆదాయం వచ్చింది. పసుపును బయోడైనమిక్‌ పద్దతిలో పండించిన మొదటి పాలన్‌పూర్ రైతు ఇతనే. పధియార్ పేడతో సహజ ఎరువులు తయారు చేస్తాడు… తన పొలంలో వివిధ కూరగాయలను పండించి వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు.
ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంపై పధియార్ స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు.. సెమినార్లు కూడా ఇస్తున్నాడు. స్కూల్, కాలేజీల పిల్లలు, రైతులు… పధియార్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఏడేళ్లుగా పధియార్ తన పొలంలో వివిధ రకాల సేంద్రియ పంటల్ని పండిస్తున్నాడు. అతని కృషిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులతో సత్కరించాయి.

Read more RELATED
Recommended to you

Latest news