అలాంటి నటుడు ఇండియాలో ఒక్కరే ఉంటారంటున్న నయనతార..!

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు , తమిళ్ చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె మామూలుగా సినిమాలకు హాజరు కాదు అనే ఒక నెగెటివిటీ కూడా ఉంది. ముఖ్యంగా ఎంత పెద్ద బ్యానర్లో సినిమా నటించినా సరే ఎంత పెద్ద స్టార్ హీరోతో జత కట్టినా సరే ఆమె మాత్రం సినిమా ప్రమోషన్లకు రాదు. అంతేకాదు తాజాగా తన భర్త సొంత నిర్మాణంలో నటించిన కనెక్ట్ సినిమా విడుదలైన నేపథ్యంలో కూడా మొదట్లో ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. కానీ తన భర్త కోరిక మేరకు ప్రమోషన్స్ లో పాల్గొని ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది.

ఈ క్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొనింది. తాజాగా యాంకర్ సుమతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార వృత్తిపరమైన విషయాలే కాదు.. వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పమని సుమా అడగగా.. ఈ విధంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ తో షూటింగ్లో పాల్గొనడం అంటే చాలా సరదాగా ఉంటుందని చెప్పిన.. ఎన్టీఆర్ డాన్స్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమాలో నటించింది. అయితే అలాంటి నటుడు కేవలం ఇండియాలో ఒక్కరు మాత్రమే ఉంటారు అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది.. అంతే కాదు ఎన్టీఆర్ చాలా క్యూట్ గా ఉంటాడు అని, తన డాన్స్ కి ఫిదా అయిపోని వారు ఉండరు అని, అతను ఒక గొప్ప డాన్సర్ అని.. డాన్స్ చేసే సమయంలో తనని తాను మలుచుకునే విధానం అవుట్ స్టాండింగ్ అని కూడా చెప్పుకొచ్చింది. ఎటువంటి రిహార్సల్స్ లేకుండా నేరుగా సెట్ లోకి వచ్చి డాన్స్ చేస్తాడు. ఇంతటి గొప్ప హీరో మరొకరు లేరు అంటూ అతడిపై ప్రశంసల వర్షం కురిపించింది లేడీ సూపర్ స్టార్.

Read more RELATED
Recommended to you

Latest news