మెట్రో స్టేషన్‌ పైనుండి దూకబోయిన యువతి.. వైరల్ వీడియో

-

ఫరీదాబాద్‌ మెట్రో స్టేషన్‌ లో కలకలం రేగింది. ఓ యువతి మెట్రో స్టేషన్‌ లో ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకబోయింది. అయితే.. ఫరీదాబాద్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఆ యువతిని కాపాడారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా ఒత్తిడితో బాధపడుతోంది.

ఈ కారణంగా సుసైడ్‌ కు ప్లాన్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఫరీదాబాద్‌ మెట్రో స్టేషన్‌ పైకి ఎక్కింది. దీంతో సమాచారం అందుకున్న ఎస్‌ ఐ ధన్‌ ప్రకాశ్, కానిస్టేబుల్‌ సర్ఫ్‌ రాజ్‌ అక్కడకు చేరుకున్నారు. మెట్రో సిబ్బందితో సహాయంతో ఆ యువతికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే స్టేషన్‌ కిందే ఉన్న ఎస్‌ ఐ ఆమెను మాట్లోకి దించి.. దృష్టి మరల్చాడు. ఇంతలోనే.. పైకి ఎక్కి ఆమెను రక్షించారు పోలీసులు. ఆ తర్వాత ఆమెను కిందకు తీసుకువచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news