ఆధార్ లో అడ్రెస్ ని ఇలా అప్డేట్ చేసుకోండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన చాలా లాభాలు వున్నాయి. పాన్ కార్డు కోసమైనా, బ్యాంక్ ఖాతా ఓపెన్ చెయ్యాలన్నా లేదంటే . భారత పౌరుడిగా గుర్తించాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు హోల్డర్లకు అందులో అడ్రస్ అప్‌డేట్ చెయ్యాలి. ఆధార్ కార్డు లో అడ్రెస్ ని అప్డేట్ చెయ్యడానికి చాలా మంది కష్టపడుతూ వుంటారు. మీరు కూడ మీ ఆధార్ లో అడ్రెస్ ని అప్డేట్ చెయ్యాలని చూస్తున్నారా..? అయితే ఇలా ఈజీగా అప్డేట్ చేసేసుకోవచ్చు.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. అడ్రెస్ ని అప్డేట్ చెయ్యడం ఈజీ కాదు దీని కోసం అక్కడి అడ్రస్ ప్రూఫ్ లాంటివి కచ్చితంగా ఇవ్వాల్సి వుంది. ఉద్యోగాల కారణంగా చాలా మంది మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఆధార్ లో అడ్రెస్ ని పక్కా మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు దీనికి వేరే డాక్యుమెంట్లు సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు ఆ దరఖాస్తుదారు తమ కుటుంబ పెద్ద పేరు తో ఉన్న డాక్యుమెంట్లను ఆధార్ అడ్రస్ అప్‌డేట్ కోసం సబ్మిట్ చెయ్యాల్సి వుంది. ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయాలంటే ఇక మీదట పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ ప్రాసెస్ చాలా సులభతరం కానుంది. ఇప్పటి దాకా ఆధార్ కార్డు లో అడ్రస్ అప్‌డేట్ చేసేందుకు అంతా తమ పేరు మీదే ఉన్న ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి వచ్చేది. అడ్రస్ ప్రూఫ్ లేకుంటే ఆధార్ కార్డులో ఆ అడ్రస్ అప్‌డేట్ చెయ్యడం కష్టం. ఇప్పుడు కుటుంబపెద్ద పేరుపై ఉన్న రేషన్ కార్డు ని కానీ లేదంటే పాస్‌పోర్ట్ లేదా మ్యారేజ్ సర్టిఫికెట్ వంటివి సబ్మిట్ చేస్తే చాలు. లేకపోతె కుటుంబపెద్ద స్వీయ ధ్రువీకరణ పత్రం ఇచ్చినా సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news