ఆధార్ నుండి కొత్త ఫీచర్.. ఇక నుండి ఆ సమస్యే ఉండదు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఏదైనా ప్రభుత్వ స్కీమ్ లో డబ్బులని పెట్టాలన్నా లేదంటే బ్యాంక్ ఖాతా ని ఓపెన్ చెయ్యాలన్నా కూడా పక్కా ఆధార్ కార్డు ఉండాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకు వస్తూనే వుంది. ఆధార్ వివరాలు మోసగాళ్ల చేతిలోపడకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. తాజాగా మరో కొత్త ఫీచర్ లాంఛ్ చేసింది. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఇ-మెయిల్ ఐడీని సులువుగా వెరిఫై చేసుకునేలా ఫీచర్ తీసుకొచ్చింది.

చాలా మంది ప్రజలు ఓటీపీ తప్పుడు మొబైల్ నంబర్‌కు వెళ్తోంది అంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. వెరిఫై ఇ-మెయిల్ లేదా వెరిఫై మొబైల్ నంబర్ ఫీచర్‌ను యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎంఆధార్ యాప్ నుండి యాక్సెస్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ని ఉపయోగించి
ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ కరెక్టో కాదో తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ టైం లో ఇచ్చిన మొబైల్ నంబర్ విషయంలో స్పష్టత లేదంటే యూజర్ మైఆధార్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా వెరిఫై ఆధార్ ఫీచర్ ని ఉపయోగించి మొబైల్ నంబర్ చివరి మూడు అంకెలను తెలుసుకోచ్చు. ఇప్పుడు తీసుకు వచ్చిన ఈ కొత్త ఫీచర్ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ అడ్రస్ లేటెస్ట్ అని, సెక్యూర్‌, పారదర్శకత, సెక్యూరిటీని ఇస్తుంది అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అంది.

 

Read more RELATED
Recommended to you

Latest news