SBI: ఇలా చేస్తే.. ప్రతి నెలా రూ.11,870 వస్తాయి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్న సేవల్లో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాల్లో చేరడం వల్ల రిస్క్ లేకుండా రాబడి ని పొందొచ్చు. అయితే స్టేట్ బ్యాంక్ ఇస్తున్న స్కీమ్స్ లో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా వుంది. దీనిలో చేరితే క్రమం తప్పకుండ రాబడి వస్తుంది. ఈ స్కీము సీనియర్ సిటిజన్స్‌కు బాగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్, ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్ వంటివి వున్నా కూడా ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్ బాగుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన డబ్బులు మెచ్యూరిటీ తర్వాత వస్తాయి.

ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్‌లో వడ్డీతో పాటుగా ఇన్వెస్ట్‌ చేసిన మొత్తంలో కొంత భాగాం కూడా చెల్లిస్తారు. ఈఎంఐ మాదిరి ఈ స్కీము ఉంటుంది. దీనిలో మీరు ఉదాహరణకు రూ .10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే పదేళ్ల కాలం డబ్బులు పొందాలని భావిస్తే.. ప్రతి నెలా 7.5 శాతం వడ్డీ కింద చూస్తే… మూడు నెలలకు ఒకసారి డబ్బులు మీకు వస్తాయి.

మూడు నెలలకు రూ. 18,750 వస్తాయి. నెలకు దాదాపు రూ. 6250 వచ్చినట్లన్నమాట. పదేళ్ల తర్వాత తిరిగి మీరు పెట్టిన రూ. 10 లక్షలు మీకు చెల్లిస్తారు. రూ. 10 లక్షలు పెడితే ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్ కింద నెల కి రూ. 11,870 వచ్చినట్లు అవుతుంది. వడ్డీ పేమెంట్‌తో పోలిస్తే.. ఇది 90 శాతం ఎక్కువ. మొదటి నెల పేమెంట్‌లో వడ్డీ డబ్బులు రూ. 6250, ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొంత భాగం రూ. 5620 రెండూ కలిపి వస్తాయి. ఈ స్కీమ్ టెన్యూర్ 10 ఏళ్లు ఉంటుంది. పన్ను మినహాయిపం కూడా ఈ స్కీము కింద పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news