ఓటర్ కార్డు, ఆధార్ లింక్ చెయ్యలేదా..? నో ప్రాబ్లెమ్..!

-

కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ గడువు పొడిస్తున్నట్లు చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇంకా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును లింక్ చేయని వాళ్లకి ఇది గుడ్ న్యూస్. ఈ రెండిటినీ లింక్ చేసుకోవడానికి 2023 ఏప్రిల్ 1తో గడువు ముగియాల్సి ఉంది. కానీ మరో ఏడాది పాటు డెడ్‌లైన్‌ ని ఎక్స్‌టెండ్ చేసింది.

ఇంకా ఆధార్ తో ఓటర్ ఐడీ ని లింక్ చేసుకోనట్టయితే ఆన్‌లైన్‌లోనే లింక్ చెయ్యచ్చు. కానీ ఇది ఏమి తప్పనిసరి మాత్రం కాదు. స్వచ్ఛందం ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చెయ్యచ్చు. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ద్వారా చాలా బోగస్ ఓట్లను గుర్తించడానికి అవుతుంది. ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే కూడా అవి రద్దు అవుతాయి.

పారదర్శకత వస్తుంది. 2021 డిసెంబర్ నెలలో లోక్ సభలో ఎలక్షన్ చట్టం కి ఆమోదం తెలిపారు. దీని వల్ల ఆధార్ కార్డు తో ఓటర్ కార్డు లింక్ అనుసంధానం చేసుకునే వెసులుబాటు తీసుకువచ్చారు. ఇక ఎలా లింక్ చెయ్యాలో కూడా చూసేద్దాం.

నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ఎన్‌వీఎస్‌పీ.ఇన్‌లోకి ముందువెళ్లాలి. లాగిన్ అవ్వాలి.
లాగిన్ వివరాలు లేకపోతే అకౌంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆ తరవాత సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్‌ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి.
ఇప్పుడు పర్సనల్ డీటైల్స్‌లోకి వెళ్లాలి.
ఇప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్ ని ఇవ్వండి.
కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది.
దాన్ని ఎంటర్ చేయాలి. ఇలా మీ ఓటర్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news