Tees Maar Khan: బీచ్ లో గోవా పాలకోవాతో రోమాన్స్ చేస్తున్న హీరో ఆది..! ఆ ర‌చ్చ మామూలుగా లేదు!

-

Tees Maar Khan: హీరో ఆది.. సాయికుమార్ న‌ట‌వారసుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి.. ప్రేమ కావాలి, ల‌వ్లీ సినిమాతో మెప్పించాడు. కానీ.. గ‌త కొత్త కాలంగా వ‌రుస వైఫ‌ల్యాల‌తో స‌త‌మ‌త‌ప‌డుతున్నాడు. చాలా రోజులుగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ గ్యాప్‌లోనే వరస సినిమాలు చేస్తున్నాడు ఆది. తెలుగుతో పాటు కన్నడలో కూడా నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ఈ క్ర‌మంలో ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

అదే తీస్ మార్ ఖాన్. ఈ చిత్రంలో ఆది జంట‌గా గోవా పాల‌కోవా పాయల్ రాజ్‌పుత్ న‌టిస్తుంది. యాక్షన్ ఓరియెంటెడ్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతిరెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జ‌రుపుకుంటోంది. ఫైన‌ల్ స్టేజ్ కి చేరుకుంది. గోవా బీచ్ ఓ హాట్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ ఆది, పాయ‌ల్ రాజ్‌పుత్ లు రెచ్చిపోయి న‌టించిన‌ట్లు ఫొటోల‌ను చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. బీచ్ లో ఆది ష‌ర్ట్ విప్పేసి అలా ప‌డుకుంటే.. పాయ‌ల్ త‌న పాదంతో ఆది గుండెల‌ను తాకుతుంది. ఈ పిక్స్ చూస్తేంటే.. ఆ సాంగ్ లో ఏ రేంజ్లో పాయల్ త‌న హాట్ హాట్ అందాల‌ను ఏ విధంగా ఆరాబోసిందో ఇక చెప్ప‌వల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news